16 April, 2026 | 6:07 AM

సీఎం వస్తే అరెస్టులేంటి?

07-04-2025 12:00 AM

వెంటనే విడుదల చేయండి 

ఖమ్మం, ఏప్రిల్ 6 ( విజయక్రాంతి ):- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం సీతారామ కళ్యాణానికి వస్తుండగా ఖమ్మం జిల్లాలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అనుబంధ ప్రజా సంఘాల కార్యకర్తలను నాయకులను అక్రమంగా శని ఆదివారాలలో అరెస్టు చేయడం అప్రజా శ్రామిక చర్యని,  అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను కోరారు. ముఖ్యమంత్రి భద్రాచలం రావడానికి, పార్టీ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి, అరెస్టులు చేయించటం సరైన పద్ధతి కాదని అన్నారు.ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని, ప్రజా ఉద్యమాలను చూసి సహించలేని స్థితని ఆయన అన్నారు.  ఖమ్మం నగరంలో ఆవుల అశోక్, కే శ్రీనివాస్, ఎన్ ఆజాద్, మణుగూరులోటీ యు సి ఐ నాయకుడు ఆర్ మధుసూదన్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేశారని తెలిపారు.