28-08-2025 10:45:39 AM
పొంగిపొర్లుతున్న చెరువులు
గన్నేరువరం,(విజయక్రాంతి): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు పొంగి పొర్లడంతో లో లెవెల్ కల్వర్టుల పై నుండి వరదనీరు భారీగా ప్రవహించడంతో గన్నేరువరం మండల(Ganneruvaram mandal) కేంద్రానికి రాకపోకలు బంద్ అయ్యాయి. గుండ్లపల్లి దేవుని చెరువు మత్తడి ప్రవాహంతో గుండ్లపల్లి నుండి మండల కేంద్రానికి, పారువెల్ల చెరువు ప్రవాహంతో పారువెళ్ల నుండి మండల కేంద్రానికి, మండల కేంద్రంలోని ఊర చెరువు ప్రవాహంతో జిల్లా కేంద్రానికి పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం జిల్లా కేంద్రానికి చేరుకోవడం కష్టతరంగా మారింది. అధికారులు నాయకులు ఇకముందైన ముందుగా లో లెవెల్ కల్వర్టులను హై లెవెల్ బ్రిడ్జిలుగా మార్చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.