28-08-2025 10:43:44 AM
గంబిరావుపేట,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గంభీరావుపేట లింగన్నపల్లి శివారులో వరదలు చిక్కుకున్న ప్రవీణ్ ను ఎన్ డి ఆర్ ఎఫ్ , ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితె సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రవీణ్ కాపాడిన అధికారులకు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.