calender_icon.png 1 October, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

01-10-2025 01:32:09 AM

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్30(విజయక్రాంతి):రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో సీపీ అధ్యక్షతన పోలీసు అధికారులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సీపీ తెలిపారు. కమీషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ఈ సెల్ కమీషనరేట్ వ్యాప్తంగా అధికారులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు.

అంతర్-జిల్లా చెక్ పోస్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఈ చెక్ పోస్టుల వద్ద ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్థులను, రౌడీ షీటర్లను ఆయా రెవెన్యూ అధికారుల ముందు బైండ్ ఓవర్ చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున, రాజకీయ అల్లర్లు జరగకుండా నివారించడానికి అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టాలనిసూచించారు.