calender_icon.png 12 September, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల రక్షణ కోసమే 1098..

11-09-2025 10:02:25 PM

విసిపిసి కమిటీలు ఏర్పాటు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): బాలల రక్షణ కోసమే 1098 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని మావల మండల ప్రత్యేక అధికారి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు(District BC Development Department Officer Rajalingu) అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం మావల మండలంలోని భట్టి సావర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి కె. రాజలింగు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు తప్పనిసరి అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా, బాలలందరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత కమిటీపైతో పాటు అందరికి ఉంటుందన్నారు. అలాగే బాల కార్మికులు లేకుండా బాలలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలన్నారు.

బాలలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన, ఇబ్బందులు పెట్టిన , బాల్య వివాహాలు జరుగుతుంటే, 1098కి టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వచ్చు అన్నారు. సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. గ్రామంలోని పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ కమిటీ వెంటనే స్పందించి దాని పరిష్కారానికి మార్గం చూస్తుందన్నారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీ కరదీపికను కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే బాలల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్పిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గయ్యా, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కె. వినోద్, పాఠశాల హెచ్ఎం రవికుమార్, డిసిపిఓ అవుట్ రీచ్ వర్కర్ కృష్ణవేణి,  అంగన్వాడి టీచర్ సువర్ణ, ఆశ కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు.