calender_icon.png 12 September, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..

11-09-2025 10:08:16 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): యూత్ 4 ఫౌండేషన్ సంస్థ సహకారంతో దివ్యాంగులకు కరీంనగర్ జిల్లాలోని ఎనిమిది మండలాలలో ఉచిత శిక్షణ, ఇవ్వనున్నట్లు సంస్థ తెలంగాణ అసిస్టెంట్ మేనేజర్ మొహమ్మద్ షాహిద్, మోరే కృష్ణ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపాధిపై ఉచిత శిక్షణ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కంప్యూటర్, టైలరింగ్, ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, బ్యూటిషన్ తదితర కోర్సుల్లో 30రోజులలో ఉచిత  శిక్షణ ఇవ్వనున్నట్లు వారు వివరించారు.

కోర్సు పూర్తి చేసిన దివ్యాంగులకు సర్టిఫికెట్ అందజేస్తామని కోర్సును బట్టి లోన్, వృత్తి సామగ్రిని అందజేస్తామని అన్నారు. దివ్యాంగులు ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులని, దరఖాస్తు చేసుకోవడానికి చిగురుమామిడి మండల కేంద్రంలోని కే.డి.సి.సి బ్యాంక్ సమీపంలోని యూత్ 4  ఫౌండేషన్ శిక్షణ కేంద్రంలో ఫోన్ నెంబర్ 9281152803ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కోఆర్డినేటర్  చల్లూరి రాజు, గూడ లక్ష్మి, మాతంగి సాయి చరణ్,పాశం ఎల్లయ్య,మల్టీ ట్రైనర్ రహీం,గ్రామంలోని దివ్యాంగులు  తదితరులు పాల్గొన్నారు.