11-09-2025 10:34:24 PM
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో గంటన్నర పాటు దంచికొట్టిన వాన
అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అబ్దుల్లాపుర్ మెట్ మండల పరిధిలో పెద్ద అంబర్పేట్, కుంట్లూరు తట్టిఅన్నారం, బాచారం, తారామతిపేట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిసరా ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్–2లో భూదాన్‌లో నిరుపేదలు వేసిన గుడిసెలలోకి వర్షపు నీరు చేరి పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే గుంతపల్లి–మజీద్‌పూర్ మధ్య ఉన్న అవంతి కాలేజీ వంతెన వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడ్డారు.