calender_icon.png 12 September, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు..

11-09-2025 10:10:13 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్(CPI State Control Commission) కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి జెండా ఆవిష్కరణ చేశారు. అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు.  దేశముకులు, జమీందారులు, భూస్వాముల రజాకా వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం బాంచన్ అనే ప్రజలచే బంధుకులకు పట్టించిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. పది లక్షల ఎకరాలు భూమి పంచి 3000 గ్రామాలను విముక్తి చేశారాని తెలిపారు. రజాకార్లు తుపాకీ గుండులను నెహ్రు పటేల్ సైన్యాలతో జరిగిన పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారనీ తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందనీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు మాజీ శాసనసభ్యులు కస్తాల రామకృష్ణ, రామకృష్ణ శాస్త్రి, బాశెట్టి గంగారాం, ఎక్స్ ఎమ్మెల్సీ పోతుగంటి పోశెట్టి, గుండా సదాశివ్, వెన్నెల ఎల్లయ్య, కిషన్ రావు నాయకత్వం వహించారన్నారు. ప్రపంచ చరిత్రలో సాయుధ  పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడినదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బి పూర్ణిమ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, టౌన్ పార్టీ అసిస్టెంట్ కార్యదర్శి బొల్లం తిలక్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు అధ్యక్షులు సోనీ, బికేఎంయు జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపు, జిల్లా సమితి సభ్యులు రాజం బెల్లంపల్లి టౌన్ కౌన్సిల్ సభ్యులు ఉప్పుల శంకర్, శనిగారపు రాజేందర్  పాల్గొన్నారు.