3 April, 2026 | 7:03 PM

గంగా స్నానం చేస్తు.. తిరిగిరాని లోకాలకు

30-11-2025 09:00 PM

వెంకటాపూర్ లో విషాదం..

మంథని (విజయక్రాంతి): మల్లన్న పట్నాలు ఉన్నాయని, గంగా స్నానం చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయన ఘటనా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం విషాదం నింపింది. మంథని ఎస్ఐ రమేష్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పంచిక సదయ్య(35) ఆదివారం ఉదయం 7 గటలకు  పంచిక రమేష్, పంచిక శ్రీశైలంలతో కలిసి గ్రామ శివారులో గల గోదావరి నదిలో గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానం చేస్తుండగా ప్రమాదంవశాత్తు గోదవరిలో మునిగిపోయాడు. గమనించిన పంచిక రుషి, పంచిక శ్రీశైలంలు సదయ్యను కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే సదయ్య మృతి చెందాడని భార్య పంచిక మధులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.