16-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జులై 15: కరీంనగర్ రీజియన్లోని 11 డిపోలకు చెందిన 51 మంది డ్రై వర్లకు సురక్షిత డ్రైవింగ్ పై కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు, డిప్యూటీ రీజినల్ మే నేజర్(ఆపరేషన్స్) ఎస్. భూపతి రెడ్డి, కరీంనగర్ రెండవ డిపో మేనేజర్ మామిడాల శ్రీనివాస్ శిక్షణ తరగతులు నిర్వహించారు.
డ్రైవర్లను ఉద్దేశించి రీజినల్ మేనేజర్ రాజు మాట్లాడుతూ సంస్థ లో ఎక్కువ ప్రమాదా లు మానవ తప్పిదల వలనే జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల వలన పాదాచారులు, ద్విచక్ర వాహన దారులు ఎక్కువ సంఖ్యలో మరణాలకు గురిఅవ్వుతున్నారని అన్నారు. కావున డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకగ్రత పా టించి, సెల్ ఫోన్ కు దూరంగా వుండి, రోడ్డు నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని అ న్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో సేఫ్టీ వార్డెన్ గోపాల్ (మంథని డిపో ), టి. కొమురయ్య (హుస్నాబాద్ డిపో)పాల్గొన్నారు.