16-07-2025 12:00:00 AM
వనపర్తి, జూలై 15 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తుడి మెఘా రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గంలోని ఆర్.జి. గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మెఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద పీఠ వేయడం జరుగుతుందన్నారు. ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పావల వడ్డీ రుణాలు అం దించిందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మహిళలకు పా వులా వడ్డీ రుణాలు అందించలేకపోయిందన్నారు.
తిరిగి ఇం దిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా బస్సులకు యజమానులను చేసేందుకు రాష్ట్రంలో మహిళా సంఘాలకు 1000 బస్సులను ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భా గంగా వనపర్తి జిల్లాకు ఆరు బస్సులు రావడం జరిగిందన్నా రు. ఇప్పుడు ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.69 వేలు అద్దె రూపంలో మహిళా సంఘాలకు ఆదాయయం సమకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, పెబ్బేరు మార్కెట్ క మిటి చైర్మన్ ప్రమోదిని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మాజీ ఎంపీపీ కిచ్చ రెడ్డి, శంకర్ ప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షులు సంధ్యారాణి, నిర్మల, స్వప్న, ఇందిరా, మహేశ్వరి, శాంతమ్మ, శ్రీలత రెడ్డి, ధనలక్ష్మి కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.