16-07-2025 12:00:00 AM
మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన చందూనాయక్
పార్క్ నుంచి బయటికి వస్తుండగా కళ్లలో కారంపొడి చల్లి, తుపాకీతో కాల్చిన దుండగులు
పాతకక్షల నేపథ్యంలోనే హత్య?
ఎస్వోటీ పోలీసుల అదుపులో నిందితులు
ఎల్బీనగర్, జూలై 15: దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని శాలివాహననగర్ కాలనీ పార్కులో సీ పీఐ నాయకుడు కేతావత్ చందూనాయక్ రా థోడ్‌ను దుండుగులు కాల్చి చంపారు. ఈ ఘ టన మంగళవారం ఉదయం జరిగింది. భూ తగాదాలు, పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా తెలుస్తున్నది. నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన చందూనాయక్ భార్యాపిల్లలతో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లోని ద్వారకనగర్ కాలనీలో ఉంటున్నారు.
మంగళవారం ఉదయం శాలివాహననగర్ కాలనీ పార్కుకు చందూనాయ క్.. భార్య నారీబాయి, కూతురు సింధూతో కలి సి వాకింగ్‌కు వెళ్లారు. అందరం కలిసి ఇంటికి వెళదామని అప్పటికే అతడి భార్య హెచ్చరించగా, తనకు ఎలాంటి భయం లేదంటూ వారి ని పంపించాడు. వారు వెళ్తుండగా షిఫ్ట్ కారు పార్కు వద్ద ఆగింది. గమనించిన నారీబాయి ఆ విషయాన్ని భర్తకు చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లిపోయింది.
వాకింగ్ చేసుకుని పార్కు నుంచి బయటికి వచ్చిన చందూనాయక్‌ను కారులో వచ్చిన నలుగురు చుట్టుముట్టా రు. ఒకరు కండ్లలో కారంపొడి చల్లగా.. మరొకరు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడి కక్కడే మృతిచెందాడు. కాగా రెండు, మూడు సంవత్సరాల క్రితం నాగోల్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ నాయకుడి హత్య కేసులో చందూ నా యక్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నర కాలం నుంచి ప్రా ణం భయం ఉన్నదని చందూనాయక్ ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలు వెంటే ఉంటున్నారు. గ తంలో తన సహచర మిత్రుడిగా, అనుచరుడి గా తనతో పాటు పనిచేసిన రాజేశ్ అనే సీపీఐఎంఎల్(మాజీ నక్సలైట్) నాయకుడితో విభే దాలు తలెత్తినట్లు సమాచారం.
సోమవారం రాత్రి ద్వారకానగర్ కాలనీలో చందూనాయక్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంట్లో భార్య ఉండటంతో చంపడానికి వీలు కాదని వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు ఎస్‌ఓటీ పోలీసుల ఎదుట లొంగిపోయిరు.
గుడిసెల విషయంలో వివాదం
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కుంట్లూరులోని రావినారాయణరెడ్డి నగర్ కాలనీలో వేసి న గుడిసెల విషయంలో రాజేశ్, శివ, పాషా, కందుల సుధాకర్‌లతో చందూనాయక్‌కు మ ధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హత్యకు గురైనట్లు బస్తీవాసులు పే ర్కొంటున్నారు. రాజేశ్ తన అనుచరులతో కలి సి చందూనాయకును హత్య చేసి ఉంటాడని మృతుడి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
చందూనాయక్ మరణవార్త విని కు టుం బ సభ్యులతోపాటు నాగోల్ సాయినగర్ బస్తీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయినగర్ నుంచి పెద్దఎత్తున బస్తీవాసులు తరలివచ్చి ఆయన సేవలను గుర్తు చేసుకుని రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.