calender_icon.png 11 August, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా నారీ శక్తి తనిఖీలు

14-05-2025 05:54:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శాంతి పద్ధతుల పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నారిశెట్టిలో భాగంగా విస్తృత తనిఖీలను బుధవారం నిర్వహించారు. బైంసా ఎస్పీ అవినాష్ కుమార్ నిర్మల్ ఎస్పీ రాకేష్ మీనా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు మహిళా కానిస్టేబుల్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. గుడుంబా విక్రయిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సీటింగ్ పై అవగాహన కల్పించి ఆర్థిక నేరల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగతనం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఉన్నారు.