11-07-2025 12:00:00 AM
జిఎం సాలెం రాజు
కొత్తగూడెం,జులై 10, (విజయక్రాంతి):సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, మహిళలకు తేనె టీగల పెంపకం పై మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అగర్తల, వెస్ట్ త్రిపుర వారిచే ఉచిత శిక్షణ తో పాటుగా, సంబంధిత పరికారాలను ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తుందని,కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. షాలేం రాజు తెలియజేశా రు.
గురువారం జిఎం మాట్లాడుతూ, సింగరేణి జీకేఓసి, వీకేఓసి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలు, కొత్తగూడెం 6,7,8,9 వార్డ్ లకు చెందిన నిర్వాసితులకు, (పెనగడప, రామవరం, రుద్రంపూర్, ధన్బాద్, గరీబ్ పేట్, పెనుబల్లి(చుంచుపల్లి మండలం), రాంపూర్, తిప్పనపల్లి, అంబేద్కర్ నగర్, సీతంపేట్, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, వనమా నగర్ & ప్రశాంతి నగర్) మహిళాలకు ఉచిత స్వయం ఉపాధిని కల్పించేందుకు తేనెటీగల పెంపకంలో శిక్షణతో పాటుగా, సంబంధిత పరికరాలను కూ డా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
కావున ఆసక్తి కలిగిన పై గ్రామాలలోని మహిళాలు తమ దరఖాస్తులను కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ నందు తేదీ. 16.07.2025 లోపు అందజేయగలరని జిఎం షాలేం రాజు పేర్కొన్నారు.