calender_icon.png 11 July, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికైన డీసీపీకి సన్మానం

11-07-2025 12:00:00 AM

జనగామ, జులై 10 (విజయ క్రాంతి) : జనగామ వేస్ట్ జోన్ డిసిపి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికైన సందర్భంగా  రాజమహేంద్ర నాయక్  కలిసి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సన్మానించడం జరిగినది  కోశాధికారి చల్లోజ్  నవీన్ చారి అయోధ్యలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా  అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ అవార్డు మన డిసిపి కి రావడం ఎంతో గర్వకారణం అన్నారు.

జనగామ పోలీసులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతలు కాపాడుతూ ప్రతి విషయాన్ని తెలుపుతూ జర్నలిస్టులకు వారధిగా నిలుస్తూ జనగామ లా అండ్ ఆర్డర్ ను కాపాడుతున్నారు అన్నారు. అవార్డు గ్రహీత డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది.

జనగామ ప్రజలకు నేను సేవలందించడం ఎంతో గర్వకారణం ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం  రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.