calender_icon.png 10 December, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

09-12-2025 07:52:01 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలోని 60వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్ మాన్ కమిటీ సభ్యులు మండల సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, 60వ డివిజన్ కాంగ్రెస్ శ్రేణులు జనగాం శ్రీనివాస్ గౌడ్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్, ఎండి సాజిద్ తదితరులు పాల్గొన్నారు.