calender_icon.png 9 October, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయితో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్

08-10-2025 01:02:22 AM

ఉప్పల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : గంజాయి సేవించి గంజాయితో సంచరిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్న సంఘ టన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాచారం సబ్ ఇన్స్పెక్టర్ వెంక టయ్య తెలిపిన వివరాల ప్రకారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీ దుర్గామాత టెంపుల్ సమీపంలో ఒడిస్సాకు చెందిన జగన్నాథ్ జై సింగ్ అనే వ్యక్తి గంజా యి నిత్యం సేవిస్తూ గంజాయి అమ్మకాలు చేపడతారని సమాచారం మేరకు నాచారం ఎస్‌ఐ వెంకటయ్య నేతృత్వంలో జై సింగును అదుపులోకి తీసుకున్నారు.

జై సింగ్ నుండి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని కోణంలో దర్యాప్తుని మొదలుపెట్టారు. మారకద్రవ్యాలు ఉపయోగించిన అమ్మకాలు చేపట్టిన చర్యలు తప్పవని నాచారం పోలీసులు హెచ్చరించారు.