calender_icon.png 11 July, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందల్వాయిలో రెచ్చిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు

11-07-2025 12:00:00 AM

పొలాల్లో పడుకుని కాపలా ఉండండి.  ఇందల్వాయి ఎస్సై ఉచిత సలహా 

నిజామాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ట్రాన్స్ ఫార్మర్ దొంగలతో రాత్రిళ్లు పంటపొలాలకు వెళ్ళే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస ట్రాన్స్ ఫార్మర్ ల దొంగ తనలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ దొంగ తనలా విషయమై పలుమార్లు పోలీసులకు మొరపెట్టుకున్న పట్టించుకో  వడం లేదని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

గత 15 రోజుల క్రితం ట్రాన్స్ ఫార్మర్ ల దొంగ తనము జరిగిన విషయమై పిర్యాదు చేసి నప్పటికిని ఇందలవాయి పోలీసులు  పట్టించుకోకపోవడంతో దొంగలు రెచ్చిపోయి మళ్ళీ దొంగతనాలకు పాల్పడి ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ తీగలను దొంగలిస్తున్నారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  వర్షంలో బయటకు రాకుండా తమ ఇండ్లలోనే ప్రజలు ఉండడంతో ఇదే అదునుగా చేసుకున్న దొంగలు చోరీలకు తెగబడుతున్నారు.

ఇందల్వాయి మండలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని అన్సాన్ పల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వరుస చోరీతో   పోలీసులకు  దొంగలు  సవాలు విసురుతున్నారు.  వారం రోజులలో సుమారు మూడు నుండి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు చోరికి గురి కావడంతో  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లు దొంగలించబడడంతో  రైతులు మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రైతులు పొలాల వద్ద కావాలి కాయలంటూ దొంగతనాలు జరిగితే మేము ఎం చేయాలంటు రైతులను ఉద్దేశించి ఎస్త్స్ర అనడంతో రైతులు నివ్వేరా పోయారు  పొలాల వద్ద కావాలి కాయాలన్న వచ్చే దొంగలు ఎంత మంది ఉంటారో మా ప్రాణాలకు దిక్కు ఎవరు అంటూ రక్షించే పోలీసులే చేతులెత్తేస్తే మా పరిస్థితి ఏంటని సదరు రైతులు వాపోతున్నారు.

నిజామాబాద్ సీపి ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా బాధితులు నేరుగ పోలీసు వారిని సంప్రదించి పోలీసు వారి సేవలను పొందాలని ప్రకటించినప్పటికిని సంబంధిత స్థానాలలోని కొందరు ఎస్‌ఐల తీరు అభ్యంతరకరంగా ఉంటోంది