calender_icon.png 11 July, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా గురువు నాగరాజ్ గౌడ్ దంపతులకు శాలువాతో సన్మానం

11-07-2025 12:00:00 AM

డీఎప్పీ సుంకర శ్రీనివాసరావు

ఎల్లారెడ్డి జులై 10 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక వైశ్య భవన్ లో నిర్వహిస్తున్న యోగా కేంద్రం లో గురుపూర్ణిమ పురస్కరించుకొని గురువారం యోగా గురువు నాగరాజు గౌడ్ దంపతులను ఎల్లారెడ్డి డి.ఎస్.పి సుంకర శ్రీనివాసరావు శాలువాతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోనే కాకుండా ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో యోగా ను ఉచితంగా నేర్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు యోగాను ప్రతి ఒక్కరు నేర్చుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

యోగ చేయడం వలన అనేక అనారోగ్యాలు మన దరిదాపుల్లోకి రాకుండా చేయగలుగుతుందని అన్నారు భారతదేశానికి పుట్టినిల్లు గా ప్రసిద్ధి చెందిన యోగ నేర్చుకోవడానికి మహిళలు, పురుషులు, ఉదయాన్నే ఒక గంట సేపు యోగా కేంద్రానికి వచ్చి సూర్య నమస్కారాలు చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని తెలియజేశారు అనంతరం యోగా సభ్యులు గురు పౌర్ణిమ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు, అడ్వకేట్ నామ శ్రీకాంత్, విశ్రాంత ఉపాధ్యాయుడు నరసింహారావు, డాక్టర్ మారుతీ రావు, పూసల రవీందర్, మూడ దుర్గయ్య, ఉపాధ్యాయులు ఘోష్కే బాలకిషన్, జై సింగ్, మూడ విట్టల్,, భాస్కర్, శ్రీనివాస్, మహిళ ఉపాధ్యాయురాలు మాధురి, తో పాటు మహిళ సభ్యురాళ్లు పాల్గొన్నారు.