30 June, 2026 | 2:11 AM

భీమేశ్వరాలయంలో పారదర్శక సేవలే

30-06-2026 12:53 AM

అక్రమ వసూళ్ల ప్రచారంలో నిజం లేదు: ఈవీ రమాదేవి

వేములవాడ, జూన్ 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆలయ కార్యనిర్వాహణాధికారి రమాదేవి స్పష్టం చేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె సోమవారం ఆలయాన్ని స్వయంగా సందర్శించి భక్తులకు అందుతున్న సేవలు, దర్శన ఏర్పాట్లను పరిశీలించారు. టికెట్ కౌంటర్లు, కొబ్బరి కాయ లు కొట్టే ప్రదేశం, కోడె స్తంభం వద్ద భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలు సుకున్నారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను వీడియో రికార్డు కూడా చేయించారు.

కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాన్ని టెండర్ ద్వా రా కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారని, భక్తుల భ ద్రత దృష్ట్యా అక్కడ సిబ్బందిని నియమించామన్నారు. భక్తులు స్వయంగా కొబ్బరి కా య కొట్టుకోవచ్చని, సిబ్బంది సహాయం తీ సుకుంటే టెండర్ నిబంధనల మేరకే వ్యవహరిస్తారన్నారు. ఆలయంపై అసత్య ప్రచా రాలు చేసి భక్తులను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేసిన ఈఓ, ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఆలయ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.