23 June, 2026 | 1:34 AM

ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా

23-06-2026 12:00 AM

బోధన్, జూన్ 22 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో, రవాణా శాఖ అధికారులు ఓవర్లోడ్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు సోమవారం రోజున ఉదయంబోధన్ ఎమ్ వి ఐ అశ్వంత్ కుమార్  నిర్వహించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ఆదేశాలు, జిల్లా రవాణా అధికారి రమేష్ రాథోడ్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 3 కేసులను నమోదు చేసినట్లు బోధన్ ఎమ్ వి ఐ అశ్వంత్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన వివరించారు. ఈ తనిఖీలలో ఎమ్ వి విఐ మణికాంత్, కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డ్ హరినాయక్ పాల్గొన్నారు.