13-01-2026 12:00:00 AM
కెపాసిటీకి మించి ఐదు రేట్ల ప్రయాణీకులు
సీటు వెనక్కి జరిపి.. చెక్క సీటు ముందు పెట్టి
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని రవాణా శాఖ
టేకులపల్లి, జనవరి 12(విజయక్రాంతి): ఆటోలో ప్ర యాణం అడ్డదిడ్డంగా మారింది. కెపాసిటీకి మించి ప్రయాణీకులను ఎక్కించి ప్రయాణం చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుం దో అన్న ఆందోళన ఏర్పడుతుంది. టేకులపల్లి మండల కేంద్రం నుంచి బోడు వెళ్లే మా ర్గంలో ఏభైకి పైగా చిన్న చితక ఆటోలు ఉ న్నాయి. ఒక్క ఆటోలో త్రీ ఇన్ ఆల్ రాసి ఉన్న దానికి ఐదు రేట్ల ప్రయాణీకులను ఎ క్కించి ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క ఆటోకు కూడా సరైన పత్రాలు కానీ, డ్రైవర్లకు లైసెన్సులు ఉన్న దా ఖలాలు లేవనే చెప్పొచ్చు. పెద్ద ఆటోలో ఐన, చిన్న ఆటో ఐన ముగ్గురే ప్రయాణీకు లు ప్రయాణించాల్సి ఉండగా దానికి విరుద్దంగా డ్రైవర్ పక్కన అటు ఇద్దరు, ఇటు ఇద్ద రు లోపల మరో పదిహేను మంది ప్రయాణీకులు ఉంటేనే ఆటో అడ్డా నుంచి కదిలే పరిస్థితి లేదు. ఆటోలో డ్రైవర్ వెనుక భాగం లో ఉ న్న సీటు వెనక్కి జరిపి ముందు ఒ క చెక్క సీటు అమర్చి పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తుంటారు.
అంటే కా కుండా వెనుకాల ఉండే డోర్ వెనక్కి తగిలించి లగేజ్ కూడా పెట్టి ప్రయాణి స్తుంటారు. నిత్యం బొగ్గు లారీలు తిరిగే టేకులపల్లి - బోడు రోడ్డులో ఎప్పుడేమి జరుగుద్దో అర్ధం కానీ పరిస్థితి. కొందరు డ్రైవర్లు మ ద్యం సేవించి నడిపడంతో ప్రమాదాలు జరి గి దండగలు కట్టిన సంఘటనలు లేక పోలే దు. పోలీసులు నిత్యం అవగాహన సదస్సు లు పెట్టి హెచ్చరించిన పెడచెవినే పెడుతున్నారు తప్ప తాము మారే పరిస్థితి లే దనే చెప్పొచ్చు. సంక్రాంత్రి, మేడా రం జాతరలు సమయంలో రవా ణా శాఖ అధికారులు కాస్త ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణీకులను అధికంగా ఎక్కించడమే కాకుండా డెక్కులు పెట్టి పాటల మోత మోగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కితే ఏమైనా తక్కు వ ఛార్జ్ తీసుకుంటారా అంటే 15 కిలోమీటర్ల దూరానికి రూ. 40 చార్జి తీసుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా నిత్యం బస్సులు తిప్పితే ఈ ఇబ్బందులు ఉండవని ప్రయాణీకులు అంటున్నారు.