13-01-2026 12:00:00 AM
కారేపల్లి జనవరి 12 విజయ క్రాంతి: పేదలకు ఉపాధీ దూరం చేసే వీబీజీ రామ్జీ వ ద్దని ఉపాధికి గ్యారంటీ ఇచ్చే ఈజీఎస్ను పునరుద్దించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కేసగాని ఉపేందర్ డి మాండ్ చేశారు. సోమవారం వ్యకాస ఆధ్వర్యంలో వీబీజీ రాంజీను రద్దు చేసి మహ త్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని పునరుద్దించాలని గ్రామపంచాయతీలో తీర్మానించాలని కోరుతూ కోమట్లగూ డెం సర్పంచ్ ఎర్రిపోతు జయసుధ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా కేస గాని ఉపేందర్ మాట్లాడుతూ వామపక్ష మద్దతు కేంద్ర యూపీఏ ౠ 1 ప్రభుత్వం 20 05లో ఉపాధీ చట్టాన్ని తీసుకవచ్చిందన్నా రు. ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రజలకు పని దొరకడం ఆవాస ప్రాంతల అభివృద్ది జరిగిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని కి తూట్టు పొడిచి స్కీమ్ పేరుతో పేదలకు అ న్యాయం చేయాలని చూస్తుందన్నారు. దీని ని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోమట్లగూడెం వార్డు స భ్యులు ఈసం వెంకటేశ్వర్లు, కేసగాని నీలిమ, కళ్యాణపు వెంకటేశ్వర్లు, నాగమణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.