19 June, 2026 | 1:34 AM

రవాణా శాఖ అధికారుల కొరడా

19-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ బైంసా కుంటాల ముధోల్ బాసర్ ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. ప్రైవేటు బస్సులో ఫిట్నెస్ ఇతర ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రజినీకాంత్ సిబ్బంది నితిన్ తేజ తదితరులు ఉన్నారు.