01-05-2025 02:01:27 AM
పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణలో రవాణా శాఖ సేవలు పరివాహన్ సారథిలోకి బుధవారం లాంఛనంగా అడు గుపెట్టింది. తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథి పోర్టల్‌ను ప్రారంభించారు. తెలంగాణ రవాణా శాఖ ఇకపై ఫెడరల్ సిస్టంలో కేంద్రంతో కలిసి సమన్వయంతో నడుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం ఆధునీకరించిన తిరుమలగిరి ఆర్టీవో కార్యా లయాన్ని కూ డా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దేశంలో పరివాహన్ సారధి అనే పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీ అనిల్ కుమా ర్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ సీఈవో తదితరులు పాల్గొన్నారు.