calender_icon.png 1 May, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై కేంద్ర నిర్ణయం సాహసోపేతం

01-05-2025 02:01:40 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే కులగణనతో కులాల వారీగా ఎంత జనాభా ఉందనేది నిక్కచ్చిగా తేలుతుందన్నారు. తద్వారా ఏ కులానికి నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ల అమలులో న్యాయం జరిగే అవకాశముందన్నారు.

మోదీ ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం కాంగ్రెస్ విజయమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ కుల గణనకు వ్యతిరేకి అని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏనాడూ  కులగణన చేయలేదన్నారు.