09-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జులై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, అధ్యాపకుల కొరత వేధిస్తోందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) మొట్టికాయలు వేసిన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందింస్తోంది. పదోన్నతులు ఇచ్చి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్స్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను భర్తీ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
అందులో భా గంగానే మంగళవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది సర్కారు. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లను సర్కారు నియమించింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు ప్రభు త్వం రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనాధికారులను నియమించడం గమనార్హం. దీంతో ప్రభుత్వ వైద్య విద్యకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు అవకాశం ఏర్పడింది.
వేగంగా పదోన్నతుల ప్రక్రియ..
మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏడీఎంఈల పోస్టింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ప్రొఫెసర్లుగా ప్రమో ట్ అయిన వారికి కూడా ప్రభుత్వం త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీల సమస్య తీరనున్నది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమా రు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు వైద్య విద్యలో ఎంట్రీ లెవల్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 607 ఖాళీలను నేరుగా భర్తీ చే సేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రి క్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ వి డుదల చేసింది. వీటితో పాటు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిం ది. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని వైద్యవర్గాలు చెపుతున్నాయి.
నాలుగేళ్ల ఎదురుచూపులకు తెర
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రొఫెసర్లు పదోన్నతుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ఎట్టకేలకు సర్కారు స్పందించి చక్కని నిర్ణయం తీసుకుందని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) పేర్కొంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డీఎంఈ నరేంద్రకుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని టీజీజీడీఏ అధ్యక్షుడు డా. నరహరి, ప్రధాన కార్యదర్శి డా. లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. ఎంకే రౌఫ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నందుకు ప్రభుత్వానికి రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.