09-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, జూలై 8 (విజయ క్రాంతి): ముందుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కి వెళ్లిన కలెక్టర్.. 100 రోజుల టీబీ ముక్తా భారత్ క్యాంపెయిన్ లో భాగంగా టీబీ బారిన పడిన వారిని. అలాగే వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారు , యాక్షన్ ప్లాన్ ఎలా చేసారు సరిపడా మెడిసన్ లు ఉన్నాయా ల్యాబ్ లో నిరార్ధణ పరీక్షకు కావలిసిన పరికరాలు ఉన్నాయా అని మెడికల్ అధికారులను అడిగి. ఆశ వర్కర్ లతో మాట్లాడి ఫీవర్ సర్వే పైన పలు సూచనలు ఇచ్చారు.
టి బి ముక్తా భారత్ అభియాన్ లో లో భాగంగా క్యాంపు లను నిర్వహించి టి బి బారిన పడిన వారిని అలాగే, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. ప్రభావిత వ్యాధి గ్రస్తుల ను గుర్తించి పరీక్ష లు చేయించాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని నిరంతరం రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం 13వ వార్డులో జరుగుతున్న ఫీవర్ సర్వే ను కలెక్టర్ పరిశీలించి.. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందించాలన్నారు .
హెల్త్, మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారుతో మున్సిపాలిటీ లలో, గ్రామాలలో సమన్వయముగా పని చేసి.. దోమలు వ్యాప్తి చెందకుండా డ్రై డే, యాంటీ లార్వాల్ స్ప్రు ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఈరోజు జనగామ పట్టణం కి సంబందించి మెడికల్ అధికారులు 953 ఇళ్ల ల్లో ఫీవర్ సర్వే చేయగ.. 11 మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు ఈ కార్యక్రమం లో మెడికల్ అధికారి శ్రీ తేజ, సూపరవైజర్ రమేష్, ఇతర మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు