09-07-2025 04:48:14 PM
వాజేడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కొరకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ వాజేడు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వాజేడు మండల తహసిల్దార్ కు రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల మంది పైగా విద్యను అభ్యసిస్తున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉండి రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కొరకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.
దీని ద్వారా విద్యార్థుల సమయం శక్తి వృధా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. దీనివలన ప్రభుత్వ పాఠశాలలకు మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కోరుకుంటున్న ఈ డిమాండ్ ను తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. లేనియెడల రాబోయే రోజుల్లో నిరసనలు ధర్నాలు మరిన్ని పోరాటాలు చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, కె. లక్ష్మీనారాయణ నాయక్, ఎల్. రాజు మహారాజు, జి. నవీన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.