calender_icon.png 28 July, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో గిరిజనుల ఆందోళన

25-07-2025 12:35:06 AM

అటవీ శాఖ అధికారులకు, గిరిజనుల మధ్య కొనసాగుతున్న వార్ 

కామారెడ్డి, జూలై 24 (విజయ క్రాంతి), పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులకు గిరిజనుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.  పోడు భూముల లో పంటలు పండించుకుంటున్న గిరిజనులను అడ్డుకొని అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు యత్నం చేస్తుండగా గిరిజనులు అటవీ శాఖ అదికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపుగల్  మండలం కాటేపల్లి తండాలో గురువారం ఉదయం అటవీశాఖ అధికారులకు గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అటవిశాఖ అధికారుల తీరును నిరసిస్తూ గిరిజనులు ఆందోళన చేపట్టారు.

న్నో సంవత్సరాల నుంచి తాము పోడు భూములలో పత్తి, మొక్కజొన్న పంటలు పండించుకుంటుండగా అటవీశాఖ అధికారులు వచ్చి భూములను లాక్కొని పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారని తమ కడుపు కొడుతున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాము వ్యవసాయం సాగు చేసుకుంటే అటవీశాఖ అధికారులు వచ్చి అవి పోడు భూము లు అంటూ వ్యవసాయం సాగు చేయవద్దు అని కండిషన్లు పెట్టి జెసిబి లతో తాము వేసిన పత్తి, మొక్కజొన్న, పంటలను చెడగొట్టి చదును చేసి మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం స్పందిం చి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను గిరిజనులకే కేటాయించి పట్టా లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులకు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వా దాలు చోటు చేసుకుంటున్నాయి. కారేపల్లి తండా లో జెసిబి తో వచ్చి అటవీశాఖ అధికారులు పోడు భూములను చదును చేస్తు న్నారు.

హరితహారం కార్యక్రమంలో భాగం గా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు పోడు భూములలో గిరిజన రైతులు వేసుకున్న పత్తి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసి జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో చదును చేస్తుండడంతో తాము పంటలు వేసుకొని పెట్టుబడులు పెట్టి నాటుకుంటే ఆమాంతంగా వచ్చి అటవీశాఖ అధికారులు పంటను చెడగొట్టడం ఏమిటని తమకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు.

అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలి ఇస్తామన్న ప్రభుత్వం పట్టాలి ఇవ్వకుండా తాము సాగు చేసుకుంటున్నా భూములలో పంటలను ద్వంసం చేసి అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతామనడం ఎంతవరకు సమంజసం అని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబాలను  ఆటవిశాఖ అధికారులు రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం స్పందించి తమ పోడు భూము లకు పట్టాలు ఇవ్వాలని తమను ఆదుకోవాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు అందిస్తామని, బోర్లు వేయిస్తామని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని గిరిజన రైతులంటున్నారు.

ప్రస్తుతం తాము పోడు భూముల్లో పంటలు వేసుకున్న తర్వాత ధ్వంసం చేసి తమకు నష్టం కలిగిస్తున్నారని, తాము సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని అటువంటి భూములను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేసి పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని గిరిజన రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పోడు భూములకు గిరిజనులకు పట్టాలి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అటవీశాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేను కోరుతున్నారు.

అధికారులు హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని అంటున్నారు. 161 వ జాతీయ రహదారిపై గిరిజన రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు వచ్చి సముదాయించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గిరిజన రైతులు తమ ఆందోళనలను విరమించారు. మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించడంతో అధికారులు ఆగ మేఘాల మీద పోడు భూముల లో చేస్తున్న పనులను ఆపివేశారు.