17-11-2025 01:19:06 AM
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
-ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బిర్సా ముండా జయంతి
-హాజరైన కేంద్ర మంత్రులు సావిత్రి ఠాకూర్, కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బిర్సా 150వ జయంతిని పురస్కరించుకుని ఈ సంవత్సరం మొత్తాన్ని గౌరవ్ దివస్‌గా జరుపుకో వాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం కేవలం 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం అన్నారు.
బిర్సా ముండా 150వ జయంతిని ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి. బీజేపీ తెలంగాణ రాష్ర్ట గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచం దర్‌రావు, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొలుత నాయకు లు ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, స్వామి వివేకానంద విగ్రహం నుంచి కుమ్రంభీం విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షు డు రామచం దర్‌రావు మాట్లాడుతూ.. బిర్సా ముండా స్ఫూర్తిని నేటి తరానికి అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అన్నారు. దేశంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బిర్సా ముండా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, బీజేపీయేతర రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఘనంగా జరుపుతున్నామని ఆయన తెలిపారు.