17-11-2025 01:19:44 AM
మిర్యాలగూడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): ప్రజలలో భక్తి భావం ఆధ్యాత్మికత పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా కార్తీక మాసంలో సోమప్ప పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు గురుస్వామి ఇనుకుల రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం గణేష్ మార్కెట్ వినాయక దేవాలయ ప్రాంగణం నుంచి ప్రారంభించిన శ్రీ శివశక్తి పాదయాత్ర సోమేశ్వరాలయం (సోమప్ప దేవాలయం) వరకు శివనామస్మరణతో విజయవంతంగా సాగిందన్నారు.
ప్రత్యేక అలంకరణ అభిషేక పూజల అనంతరం దాతలు రచ్చ సత్యనారాయణ, కటకం రామకృష్ణ ల దాతృత్వంతో 1500ల మందికి అన్నప్రసాదం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోల సైదులుముదిరాజ్, రచ్చ మధు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, జైని శ్రవణ్, కోల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.