calender_icon.png 19 January, 2026 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరమవీరచక్ర అవార్డు గ్రహీతలకు గౌరవ వందనం

11-11-2024 01:27:00 AM

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): హిందూ ఆధ్యాత్మక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బృహత్ మేళా సేవా ప్రదర్శన్  కార్యక్రమంలో 21 మంది పరమవీర చక్ర అవార్డు పొందిన సైనికులకు గౌరవ వందనం చేశారు. పరమవీర చక్ర అవార్డు పొందిన యోగేంద్రసింగ్ యాదవ్‌ను సన్మానించారు.

మరణాంతరం పరమవీరచక్ర పతకాలను పొందిన సైనికులకు గౌరవ వంద నం నిర్వహించారు. మాతా పితృవందనం, మానవీయం సేవా వ్రతుల కు సత్కారం తదితర కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ప్రముఖ వ్యక్తుల సందేశాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. జస్టిస్ ఎల్ నర్సిహారెడ్డి, అప్పల ప్రసాద్,  యోగేంద్రసింగ్ యాదవ్, బోధమయానంద తదితరులు ప్రసంగించారు.