15-05-2025 12:00:00 AM
ఒకరు మృతి
రాజేంద్రనగర్, మే 14 : ఔటర్ రింగ్ రోడ్డుపై ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని మరో డీసీఎం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి గ్రామానికి చెందిన కాల్వ అంజయ్య(45) మామిడిపల్లిలోని రిలయన్స్ వెజిటేబుల్స్ లో సూపర్వై జర్‌గా పనిచేస్తున్నాడు.
ఈక్రమంలో అయన కంపెనీకి సంబంధించిన డీసీఎం వ్యాన్ లో మంగళవారం రాత్రి 7 గంటలకు కండ్లకోయ నుంచి కూరగాయలు తీసుకొని శం షాబాద్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని 136+500 కిలోమీటర్ వద్ద డీసీఎం డ్రైవర్ రాజు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నడుపుతూ ముందు వెళ్తున్న మరో డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో వాహనం క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. బుధవారం మృతుడి భార్య కాల్వ లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.