14-04-2025 12:00:00 AM
- ఇటీవల సింగపూర్ లో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 13 : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్ లో ఆయన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో తన భార్య అన్నా లెజినోవా, కూతురు పోలేనా అంజనా పవనో వా తో కలిసి పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. గాయపడిన కుమారుడిని పవన్ తన భుజాలపై ఎత్తుకొని ఏర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరడంతో ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి సిఐఎస్‌ఎఫ్ అధికారులు కొంతమేర ఇబ్బం ది పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆయన కొంత కాలం పాటు హైదరాబాదులోనే ఉంటారా లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపో తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
కుమారుడి ఆరోగ్యంపై ట్వీట్
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ’ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. తన కుమారుడి ఆరో గ్యం నిలకడగా ఉందన్నారు. మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసి మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన రాజకీయ నేతలు, జనసేన నాయ కులు, అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పవన్ చెప్పారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ అధికారులు, సింగపూర్ లోని భారత హైకమిషన్ అధికారుల సమన్వయం ఈ క్లిష్ట సమయంలో ఎంతో భరోసా ఇచ్చిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.