01-05-2025 01:05:22 AM
ఖమ్మం, ఏప్రిల్ 30:- నేటి పదో తరగతి ఫలితాలలో త్రివేణి విద్యార్థులు టాప్ మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారు. ప్రగతిఫలాల తెలంగాణలో ప్రభంజన ఫలితాల త్రివేణి సంచలన రికార్డును సాధించింది.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విడుదలైన పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభిమ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తిక ఓ ప్రకటనను విడుదల చేశారు. త్రివేణి అన్ని బ్రాంచీలలో గల తమ విద్యార్థులు ఎస్‌ఎస్ సి లో 600 మార్కులకుగాను 593 మార్కులు సాధించి టాప్ ప్లేస్ లో నిలిచారని తెలిపారు. అలాగే వరుసగా 593, 590,587,587,587, 586, 586, 586,586, 584, 583,583, 583, 582, 582, 581, 581, 581, 581, 580, 580, 580,.. వంటి టాప్ మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది.
త్రివేణి.570మార్కులకు పైగా 61 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 200మంది, 500లకు పైగా మార్కులను 686మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. గతంలో గ్రేడుల విధానంలోనైనా, నేడు మార్కులు గ్రేడుల విధానంలోనైనా త్రివేణికి తిరుగులేదని తెలిపారు. అలాగే అత్యధిక బ్రాంచీలలో 100 శాతం పాస్ పర్సంటేజ్ మరోసారి తెలంగాణ నెం.1గా త్రివేణి నిలిచిందని తెలిపారు.
ఇన్ని విజయాలకు కారణం మారే తరానికి, మారే విద్యావిధానాలకు అనుగుణంగానూ, నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా విద్యనందిస్తున్నామని తెలిపారు. అలాగే తమ విద్యాసంస్థలో అనుభవం, అంకితభావం గల బోధనా సిబ్బంది ఉండటం వలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. టాప్ గ్రేడ్ సాధనకే పరిమితం కాక,జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ, నీట్, జెఎస్‌ఓ, ఎన్టిఎస్‌ఇ, ఓలంపియాడ్ వంటి రేపటి పోటీపరీక్షల్లో కూడా విజయం సాధించేలా పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుందని, వారి ఉజ్వల భవితకు నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు. విద్యార్థులకు, ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, బోధన, బోధనేతర సిబ్బందికి తమ శుభాభినందనలను తెలిపారు.