calender_icon.png 1 May, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎండీఏ స్థలంలో నిర్మాణాలు

01-05-2025 01:07:13 AM

15 నిర్మాణాలను నేలమట్టం చేసిన రెవెన్యూ, హెచ్‌ఎండిఏ  అధికారులు

రాజేంద్రనగర్, ఏప్రిల్ 30: హెచ్‌ఎండిఏ స్థలాన్ని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేప ట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం రెవెన్యూ, హెచ్‌ఎండిఏ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వాటిని కూల్చివేశారు. రాజేంద్రనగర్ తహసిల్దార్ బొమ్మల రాములు తెలిపిన వివ రాల ప్రకారం.. మండల పరిధిలోని బుద్వేల్ గ్రామ సమీపంలో ఉన్న మానసా హిల్స్ దగ్గర హెచ్‌ఎండిఏ స్థలం ఉంది.

కొందరు వాటిలో కొంతకాలం క్రితం 15 నిర్మాణాలను చేపట్టారు. ఈ విషయంలో హెచ్‌ఎండి అధికారులకు ఫిర్యాదులు అందడంతో చర్యలకు ఉపక్రమించారు. బుధవారం హెచ్‌ఎండిఏ తహసిల్దార్ దివ్య, రాజేంద్రనగర్ తహసిల్దార్ బొమ్మల రాములు ఆధ్వర్యంలో జెసిబి లతో 15 నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు.

ఈక్రమంలో ఆక్రమణదారులకు అధికారులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. అనం తరం తహసిల్దార్లు దివ్య, రాములు మాట్లాడుతూ.. గుర్తొస్థలాల్లో నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారు ఉన్నా కూల్చివేస్తామని హెచ్చరించారు.