01-05-2025 01:05:16 AM
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత కంది ఉగ్రదాడిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం
ఆదిలాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): ఉగ్రవాదుల దాడి వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఇటీవల పహ ల్గాంలో జరిగిన ఉగ్రదాడి నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం నిరసన తెలిపారు.
ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ నా యకులు పాకిస్తాన్ వెళ్లాలి అన్న ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి తప్పు బట్టారు.
ఉగ్రవాదానికి బలైంది తమ కాంగ్రెస్ పార్టీ అని ఇద్దరు కాం గ్రెస్ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ రాజీ వ్ గాంధీని పొట్టన బెట్టుకున్నది ఉగ్రవాదం కాదా అని గుర్తు చేసారు. ఇతర పార్టీని విమర్శించే ముందు ఒకసారి చరిత్ర తెలుసుకో వాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పహల్గాంఉగ్రదాడిలో ప్రాణాలుకోల్పోయిన వారికి నివాళ్లు అర్పిస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి ఆయన తెలిపారు.