22 April, 2026 | 3:10 AM

ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు

22-04-2026 01:46 AM

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెకు టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని వారికి మద్దతిస్తారన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆర్టీసీ కార్మికులకు అండగా టీఆర్పీ నిలబడుతుందని,పోరాటం చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు. ఆర్టీసీ జేఏసీ చర్చలు సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిర్ణయించారు.