calender_icon.png 27 January, 2026 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధిపత్యమే ట్రంప్ సిద్ధాంతం!

21-01-2026 12:00:00 AM

అమెరికా అధ్యక్ష పీఠం రెండోసారి అధిరోహించినప్పటి నుంచి డొ నాల్డ్ ట్రంప్ తన విధానాల ద్వారా ప్రపంచ దేశాల పయనాన్ని అభివృద్ధి, సహకారం వైపు కాకుండా, మూడో ప్రపంచ యుద్దానికి సన్నద్ధం చేస్తున్నట్లుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి చెప్పే మార్గంలో కాకుండా, తాను చెప్పిన దారిలోనే నడవాలనే నిరంకుశ విధానాలకు తెరలేపారు.

ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్న చైనా, రష్యా వంటి దేశాలతో ప్రత్యక్ష దాడులకు పాల్పడకుండా, నియంత్రణ చేయాలనే ఆలోచనలతో  ‘ట్రేడ్ వార్’కు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయాలని ఆ దేశం నుంచి చ మురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై భారీ ఎత్తున సుంకాలు విధిస్తూ వచ్చారు. అదే సమయంలో ఉక్రెయిన్ ను లోబరుచుకునే ప్రయత్నం ద్వారా రష్యాకు చెక్ పెట్టాలని పన్నాగం పన్నారు. చైనాను బలహీనపరచాలన్న ఉద్దేశంతో అప్పటికే వివిధ దేశాల్లో ఆ దేశం పెట్టిన పెట్టుబడులు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వెనిజులా వంటి దేశాలను తన అధీనంలోకి తీసుకోవడం జరిగింది. తాజాగా గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ క న్ను పడింది.

వెనక్కి తగ్గని ఈయూ!

ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వనరులను తమ అధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పటికే అక్కడ తిష్ట వేశాయి. ఈ క్రమంలోనే గ్రీన్‌లాండ్‌లో కూడా రష్యా, చైనా దేశాల ప్రభావం గట్టిగానే ఉంది. ఈ దేశాల ప్రాబల్యం తగ్గించడంతో పాటు ముఖ్యంగా అరుదైన ఖనిజ నిక్షేపాల కొరతను అధిగమించడానికి గ్రీన్‌లాండ్‌ను ఆక్రమణ పేరుతో ట్రంప్ వడివడిగా అడుగులు వేశారు. ఈ విషయంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చివరికి తన మిత్ర దేశాలైన నాటో, ఈయూ కూటమి దేశాలతోనూ వైరం పెట్టుకున్నారు. ఎవరైనా తాను త్వరలో ఆక్రమిం చుకోబోతున్న గ్రీన్‌లాండ్ విషయంలో అడ్డువస్తే ఊరుకునేది లేదంటూ మిత్ర దేశాలపై ‘గ్రీన్‌లాండ్ టారిఫ్’ పేరిట 10 శాతం అదనపు సుంకాలు విధిస్తూ హుకుం జారీ చేశారు.

అంతేకాదు మంగళవారం ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా కొత్త మ్యాప్‌ను షేర్ చేశారు. కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజులాను అమెరికా భూభాగా లుగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదలచేయ డం చర్చనీయాంశంగా మారింది. గ్రీన్‌లాండ్ విషయంలో నాటో, ఈయూ కూట మి దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో సమస్య మరింత కఠినంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఒకటిగా ప్రయా ణం చేసిన అమెరికా, యూరోపియన్ దేశా లు, నాటో కూటమి మధ్య అగాధం ఏర్పడడంతో పరిస్థితులు మూడో ప్రపంచ యు ద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళన కూడా నెలకొంది.

ఓర్వలేని అమెరికా..

మరి ట్రంప్ తన ద్రృష్టి గ్రీన్ ల్యాండ్ పైనే ఎందుకు పెట్టారన్నది పరిశీలిస్తే, ‘జాతీయ భద్రత కొరకే’ అని పైకి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్న విషయం గ్రహించాలి. ట్రంప్ ఆలోచనను లోతుగా పరిశీలించి చూ స్తే విషయం అవగతమవుతుంది. అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా చైనా వంటి దేశాలపై ఆధారపడే అవసరం అమెరికాకు ఉండదు. గ్రీన్‌లాండ్‌ను హస్తగతం చేసుకోవడం ద్వారా రష్యా, చైనా వంటి దేశాలను నియంత్రణ చేయవచ్చన్నది ట్రంప్ ఆలోచన.

ఇప్పటిదాకా డెన్మార్క్‌లో భాగం గా ఉన్న గ్రీన్ ల్యాండ్‌లోని ప్రజలు ఇక మీద ట కూడా ‘మేము మేముగానే ఉంటాం.. అమెరికా పంచన చేరబోము’ అని చెబుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహ నాలు, యుద్ధ విమానాలు, పరికరాలు, సైని క పరికరాలు,  ఎయిర్ బ్యాగ్ లు, ఎల్ ఈడీ లైటు, కార్లు పవర్ విండోస్, డిజిటల్ కెమె రా, కంప్యూటర్ హార్డ్ డిస్క్ తదితర వస్తువుల పరికరాలు తయారిలో అరుదైన ఖని జాలే కీలక భూమిక పోషిస్తూ అభివృద్ధి చెం దిన దేశాలకు ఆయువుపట్టుగా మారడంతో వీటిని నియంత్రణ చేయాలనే ఆలోచనలు ట్రంప్‌లో మొదలయ్యాయి. ఇప్పటికే ప్రపం చ దేశాలకు 60 శాతం రేర్ ఎర్త్ మినరల్స్‌ను చైనానే సరఫరా చేస్తుంది. అదీగాక దాదాపు 90 శాతం ఖనిజాలు చైనా నియంత్రణలో ఉండటం అమెరికా సహించలేకపోతున్నది.

చివరికు అమెరికా సైతం అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడాల్సి రావడంతో అమెరికా ఆధిపత్యానికి అడ్డు పడుతున్నట్లయింది. అందుకే సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల అరుదైన ఖనిజాలకు కేం ద్రంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవడం ద్వారా చైనాకు చెక్ పెట్టవచ్చనే ధోరణి ట్రంప్‌లో పెరిగిపోయింది. కానీ చైనా ముం దు చూపుతో వ్యవహరించిన దాదాపు 1990 నుంచి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై పట్టుసాధించడం ద్వారా ఉత్పత్తి, సరఫరాలో రారాజుగా రాణిస్తున్నది.  20వ శతాబ్దం చివరి వరకు చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలు ప్రపంచంలో ఆధిపత్యం కనపరచగా, నేటి శతాబ్దంలో మాత్రం రేర్ ఎర్త్ మినరల్స్ కలిగిన దేశాలదే పైచేయి అన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. 

ఉద్రిక్తతలతో ప్రయాణం..

ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకోవడం కోసం ట్రంప్ అమలు చేస్తున్న విధానాలపైై, తన సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, మిత్ర దేశాలైన నాటో, యూరోపియన్ దేశాలు వద్దని వారిస్తున్నా మూర్ఖత్వంగా మొండి పట్టుదలతో ముందుకు పోతున్నారు. ట్రంప్ అనాలోచిత ధోరణి వల్ల భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ‘నేను యుద్ధాలను ఆపుతాను, శాంతికి చిరునామా నేను’ అని చెబుతున్న ట్రంప్ విధా నాలు నచ్చక  స్వదేశంలోనే ‘నో కింగ్స్’ పేరిట భారీ నిరసన కార్యక్రమాలు ప్రజలు చేపట్టిన విషయం మరిచిపోకూడదు. ప్రపం చ వ్యాప్తంగా సంభవించే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చివరికి ఐక్యరాజ్యసమితి నామమాత్రంగా మారడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పైగా ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్‌కు ప్రత్యామ్నాయంగా ‘బోర్డు ఆఫ్ పీస్’ అనే మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడానికి ట్రంప్ శ్రీకారం చుట్టడం కూడా ఉద్రిక్తతలకు దారి తీయనుంది. ఒక పక్క రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ట్రంప్ విధానాలు, ఆక్రమణ సిద్ధాంతం, ఆధిపత్య ధోరణి, మరోవైపు ఇరాన్‌లో అలజడి, బంగ్లాదేశ్‌లో అస్థిరత్వం, నాటో, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య విభజన రేఖలు, పలు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ప్రకృతి ప్రకోపాలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, జెన్ జెడ్ ఉద్యమాలతో దాదాపు యావత్ ప్రపంచం ఉద్రిక్త పరిస్థితులతోనే ప్రయాణం కొనసాగిస్తున్నది. 

చర్చలే మార్గం!

తాజాగా ‘గ్రీన్‌లాండ్’ వ్యవహారం ‘అమెరికా వర్సెస్ యూరప్‌గా’ మార్చేసింది. ఈ పరిస్థితుల్లో యావత్ భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని మార్చే ‘గేమ్ ఛేంజర్’గా గ్రీన్‌లాండ్ ‘నిలవబోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాట, ఒక వ్యక్తి, ఒక నిర్ణయం ఎంత ప్రభావాన్ని చూపుతాయనేది చెప్పడానికి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే ఉదాహరణ. ఏది ఏమైనా, నేటి ఆధునిక కాలంలో సమస్యలు పరిష్కారానికి చర్చలే మార్గం అని యావత్ ప్రపంచం గుర్తెరగాలి. శాంతి కోసం క్రృషి చేసే ఐక్యరా జ్యసమితి, అంతర్జాతీయ సంస్థలకు ప్రపంచ దేశాలు బాసటగా నిలవాలి. నిధులు సమకూర్చాలి. ఇతర అంతర్జాతీయ  కూటమి దేశాలు జీ-20, బ్రిక్స్, ఎస్సీవో, ఆఫ్రికన్ దేశాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ప్రపంచ దేశాల సుస్థిరాభివృద్ధికి, శాంతికి, సార్వభౌమత్వం కోసం పాటుపడాలి. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పద్ధతి లోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని గ్రహించాలి. అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలి అనే భావనతో ముందుకు సాగాలి. 

వ్యాసకర్త సెల్: 9390509791

ఐ ప్రసాదరావు