10-08-2025 01:20:00 AM
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించి ఓవల్ ఆఫీసులోకి అడుగు పెట్టిన మరుక్షణమే వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువయ్యారు. రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తన చేష్టలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని ఎన్నికల సందర్భంగా హామీనిచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. రెండోసారి అధికారం చేపట్టిన తలా తోకా లేని నిర్ణయాలతో ఎవరికీ అర్థం కాని వ్యక్తిలా మారిపోయారు. సుంకాల విషయంలోనూ అర్థం కాని రీతిలో వ్యవహరిస్తున్న ట్రంప్.. తనకు గిట్టని దేశాలతో వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఆరు నెలల్లో ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ట్రంప్ దొరవారి ఉవాచలు ఒకసారి పరిశీలిద్దాం..
ఆ హక్కు వలసదారుల పిల్లల కోసం..
‘జన్మతఃపౌరసత్వం అనేది వలసదారుల పిల్లల కోసం తీసుకొచ్చారు. అంతే కానీ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పిల్లలకు జన్మనిచ్చేందుకు ఇది తీసుకురాలేదు. ప్రతిఒక్కరూ ఇక్కడకు వచ్చి పిల్లల్ని కంటున్నారు. వలసదారుల పిల్లలకు ఈ హక్కు ఉం డాలని నేను కూడా అనుకుంటా. అంతే కానీ దీన ర్థం ప్రపంచం మొత్తం అమెరికాను ఆక్రమించమని కాదు. అర్హత లేని వారు ఇక్కడికి వస్తూ అర్హత లేని పిల్లల్ని కంటున్నారు.’
జన్మతః పౌరసత్వం రద్దు సందర్భంగా ట్రంప్ దశాబ్దాలుగా అమెరికా లూటీ
‘ఏప్రిల్ 2 2025 అమెరికా లిబరేషన్ డే. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈరోజు నుంచి అమెరికా చరిత్ర మారుతుంది. అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మార్చేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దశాబ్దాలుగా అమెరికాకు శత్రువులు, మిత్రులుగా చలామణీ అవుతున్న దేశాలు అగ్రరాజ్యాన్ని సుంకాల పేరుతో లూటీ చేస్తున్నాయి. మేము వేసే సుంకాలు మా మీద ఇతర దేశాలు విధించే సుంకాలతో పోల్చుకుంటే తక్కువ.’
వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రతిపాదన సందర్భంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’
‘గల్ఫ్ ఆఫ్ అమెరికా అనేది ఎంత గొప్ప పేరు. మే ము తప్పకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మా రుస్తాం. ఈ గల్ఫ్ అమెరికాకు చెందినది. మా ప్రభు త్వం అమెరికా పేరును మళ్లీ గొప్పగా మారుస్తోంది. ఇక నుంచి ఫిబ్రవరి 9 గల్ఫ్ ఆఫ్ అమెరికా డే.’
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ
‘మెక్సికో ఫెంటానిల్ డ్రగ్‌ను అక్రమంగా అగ్రరాజ్యంలోకి డంప్ చేస్తోంది. అక్రమవలసదారులను కూడా అడ్డుకోవడం లేదు. అందుకోసమే మెక్సికో దేశ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నా. ఎవరైనా సరే చట్టబద్ధంగా దేశంలోకి వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ ఏ దేశ పౌరులైనా సరే చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సి ఉంటుంది.’
మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ సందర్భంగా ట్రంప్ డోజ్ ఎంతో మేలు చేస్తోంది
‘అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ)ని తీసుకొచ్చాం. ఈ డోజ్ ద్వారా ఎంతో ఆదా అవుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం వరకు 1 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయడమే లక్ష్యం. సెప్టెంబర్ చివరి వరకు ప్రతిరోజు ఆదా చేయడమే డోజ్ లక్ష్యం.’
డోజ్ ఏర్పాటు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ బంతి చైనా కోర్టులోనే..
‘ఫెంటానిల్ డ్రగ్ వల్ల అమెరికాలో ప్రతిరోజు 200 మంది ప్రాణా లు కోల్పోతున్నారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఫెంటానిల్ డ్రగ్‌ను అరికట్టడంలో చైనా చైనా ఎప్పటి నుంచో విఫలమవుతూ వస్తోంది. ఈ డ్రగ్ ఎగుమతిని అడ్డుకోవాలని చైనాను ఎన్ని సార్లు అభ్యర్థించినా ఫలితం లేదు.
అందుకోసమే చైనాపై అదనపు సుంకాలు విధిస్తున్నాం. కేవలం చైనాపై మాత్రమే కాకుండా మెక్సికో, కెనడాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తున్నాం. బంతి ప్రస్తుతం చైనా కోర్టులోనే ఉంది. చైనా ముందుకొచ్చి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. ఒప్పందం కోసం మేము వారిని అడగం.’
చైనాపై అధిక సుంకాలు విధించినపుడు ట్రంప్ వ్యాఖ్యలు మస్క్ దుకాణం సర్దేయాల్సిందే
‘డోజ్ నుంచి మస్క్ తప్పుకున్న తర్వాత అతని ఆలోచనా వేగం తగ్గిపోయింది. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను వ్యతిరేకిస్తూ ఆయనకు బయటకు వెళ్లిపోయారు. ఆ బిల్లు కచ్చితంగా అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందుతుంది. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు లేకుంటే అపరకుబేరుడు ఎలాన్ మస్క్ దుకాణం మూసుకుని తన సొంత దేశం సౌతాఫ్రికాకు పోవాల్సి వచ్చేది.
చరిత్రలో ఎవరూ పొందని రాయితీలను మస్క్ పొందుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు మంచివే అయినప్పటికీ ప్రతి ఒక్కరూ అవే కొనాలని ఒత్తిడి తేలేను. ఇక మీదట రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు. తద్వారా అమెరికా మరింత సొమ్ముని ఆదా చేసుకుంటుంది. ఈ అంశాన్ని డోజ్ పరిశీలించాలి.’
మస్క్ హెచ్చరికల సందర్భంగా ఇలా అనేక సందర్భాల్లో ట్రంప్ తనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ట్రంప్ విధానాలు నచ్చక చాలా మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అయినా ట్రంప్ మాత్రం తన వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు. ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికవడం కోసం అహర్నిశలు కృషి చేసిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌తో ట్రంప్ సున్నం పెట్టుకున్నారు.
ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ అధిపతిగా సర్వాధికారాలు చెలాయించిన మస్క్ ఒక్కసారిగా ట్రంప్‌కు వ్యతిరేకంగా మారా రు. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలకు తెరతీసింది. ఆ పొరపొచ్చాలు రోజురోజుకూ పెరుక్కుంటూ పోతూనే ఉన్నాయి తప్పా.. తగ్గడం లేదు. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు అమెరికన్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తూ వస్తోంది.
ఈ రాయితీలను కనుక ఆపేస్తే మస్క్ దుకాణం మూసుకుని, స్వదేశం దక్షిణాఫ్రికాకు వెళ్తాడని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌తో మనస్పర్థల తర్వాత మస్క్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడిపై అనేక ఆరోపణలు చేశారు. తను కొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని పేర్కొన్నారు. అందుకు సోషల్ మీడియా లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేప ట్టారు.
ఇక ప్రపంచంలో ఏ మూలన యుద్ధాలు జరిగినా నే ను వాటిని నిలుపుదల చేశానంటూ ట్రంప్ ప్ర కటించుకోవడం కొసమెరుపు. ఇన్ని చెబుతూ వ స్తున్న ట్రంప్ మొన్నటికి మొ న్న ఇరాన్‌పై ‘ఆపరేషన్ మిడ్ నై ట్ హ్యామర్’ పేరిట విరుచుకుపడ్డా డు. ఇరాన్‌లోని మూడు ప్రధాన అణుస్థావరాలను అమెరికా బాంబులు ధ్వంసం చేశాయి. అ ప్పుడే మంచోడిలా.. కాసేపటికే చెడ్డోడిలా..
మరోసారి అమాయకత్వంతో ఊసరవెల్లి మాదిరి ట్రంప్ మాటల రంగు మారుస్తూ వస్తున్నారు. ఇదంతా దేనికి చేస్తున్నారు అని ఆలోచించి చూస్తే అంతిమంగా ఆ యన టార్గెట్ నోబెల్ శాంతి బహుమతే. మరి ట్రంప్ దొరవారి ఉవాచలు చూసైనా రాయల్ స్వీడీష్ అకాడమీ మనసు కరిగి నోబెల్ శాంతి ఇస్తుందేమో చూడాలి.
అక్రమవలసదారులకు శిక్ష తప్పదు
‘అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులకు కఠిన శిక్ష తప్పదు. అక్రమంగా ఉంటున్న వారిని దేశం నుంచి పంపించడమే మా లక్ష్యం. ఇల్లీగల్ ఏలియన్స్: మీరు ఉచితంగా ఫ్లుటై బుక్ చేసుకోండి. విమాన టికెట్ డబ్బులతో పాటు కొన్ని డబ్బులను కూడా ఇస్తాం. అక్రమంగా నివాసం ఉంటున్న వారు వెళ్లిపోవాలి. మేమే విమాన టికెట్ డబ్బులు భరించి వారిని స్వదేశంలో వదిలేస్తాం.’ అక్రమవలసదారులను వెనక్కి పంపే క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు
భారత్ యుద్ధం ఆపా
రెండు న్యూక్లియర్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. ఎక్కడైతే సహాయం అవసరం పడుతుందో అక్కడ నేను ఉంటా. వాణిజ్యం ద్వారా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను శాంతింపజేశా. భారత్, పాక్ కాల్పుల విరమణ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్, ఇజ్రాయెల్‌తో మాట్లాడి పరిష్కరించా..
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించా. ఆ రెండు దేశాలు ప్రస్తుతం అలసిపోయాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇకపై రెండు దేశాలూ కాల్పుల విరమణను ఉల్లంఘించొద్దు.
ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సందర్భంగా నాకు నోబెల్ ఇవ్వరేమో..
ఎన్నో యుద్ధాలు ఆపా. ఎందరికో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాయం చేశా. కానీ నాకు మాత్రం నోబెల్ ఇవ్వరు. భారత్ సెర్బియా మధ్య యుద్ధాలు ఆపా. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతి చర్చలు జరిగేలా చూశా అయినా నాకు నోబెల్ ఇవ్వరు. నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ పేర్కొన్న సందర్భంలో