12-08-2025 08:54:46 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బైరు మల్లేశ్వరి(Mandal Parishad Development Officer Bairu Malleshwari) మండలంలోని గంగారం లచ్చగూడెం, కిష్టారం, బర్లగూడెం, చింతోనిచేలక, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలను మంగళవారం విస్తృతంగా పర్యటించి సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చింతోనిచెలక గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తికోయల ఆవాసమైన సర్వనబోడు గ్రామాన్ని సందర్శించి వారితో నీటి సమస్యలు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గంగారంలో నర్సరీని, ఇంకుడు గుంటలను పరిశీలించారు. లచ్చగూడలో పల్లె ప్రకృతి వనాన్ని నర్సరీని, చెరువులను పరిశీలించారు.
కిష్టారం గ్రామాన్నీ సందర్శించి అంగన్వాడి సెంటర్ ని పిల్లలకి భోజన వివరాలను అడిగి తెలుసుకొని నర్సరీని పరిశీలించారు. బర్లగూడెం పరిధిలోని మోట్లగూడెం గ్రామంలో గల రాయపాడు బ్రిడ్జిని పరిశీలించి వరద ప్రవాహాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జక్కుల గణేష్ గాంధీ, ఏపీవో కాళంగి శ్రీనివాస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తిరుపతయ్య, కార్యదర్శి శ్వేత, టి ఏ ధనలక్ష్మి ఎఫ్ ఏ లఖన్, కార్యదర్శులు కవిత, అనిల్, సునీల్, సతీష్, జీవన్, టెక్నికల్ అసిస్టెంట్ భీముడు, క్షేత్ర సహాయకులు సత్యనారాయణ, సరిత పాల్గొన్నారు.