12-08-2025 08:50:14 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కుకూడ రైతు వేదికలో నానో యూరియాపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏవో నాగరాజు(AO Nagaraju) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నానో యూరియా డిఏపి వాడటం వల్ల పంట దిగుబడి అధికంగా వస్తుందని రైతులకు సూచించారు. పర్యావరణానికి కాలుష్యం ఏర్పడకుండా ఉంటుందని తెలిపారు. భూమి సారవంతం పెరుగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులకు పలు సలహాలు సూచనలు తెలిపారు. నానో యూరియా డిఏపి వాడకంతో రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మారుతి, రైతులు పాల్గొన్నారు.