calender_icon.png 23 November, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సమస్యలపై టీఎస్ యుటిఎఫ్ రాజీలేని పోరాటాలు

23-11-2025 07:22:16 PM

ఆ సంఘం జిల్లా కార్యదర్శి ప్రధాన పెరుమాళ్ళ వెంకటేశం..

నకిరేకల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ సమస్యలపై టీఎస్ యుటిఎఫ్ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నకిరేకల్, శాలిగౌరారం కేతపల్లి మండలాల మండల మహాసభలో ఆయన మాట్లాడారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.  ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డి ఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కులగణన సర్వే చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యూరేషన్ విడుదల  చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి యాట మదుసుధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మండల మహాసభలలో జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు టి.నర్సింహమూర్తి, ఎస్టిఎఫ్ఐ మహిళా కన్వీనర్ జి. శ్రీలత, స్టడీ సర్కిల్ కన్వీనర్ రాగి రాకేష్ కుమార్, నకిరేకల్, శాలిగౌరారం, కేతపల్లి మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుర్మిళ్ళ శ్రీనివాస్, ఈ.హరికృష్ణ, కె.రవికుమార్, కె.నాగయ్య, పి.జయసాగర్, నాయకులు పి.తిరుమలయ్య, బి. వేణుగోపాల్, సైదమ్మ, జ్యోతి, రఫీ తదితరులు పాల్గొన్నారు.