calender_icon.png 23 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో ప్రతుల దగ్ధం

23-11-2025 07:24:23 PM

బీసీలను నమ్మించి మోసగించిన బిజెపి, కాంగ్రెస్..

కాంగ్రెస్ బిజెపిల మోసాలపై బీసీ సమాజం మేల్కొనాలి..

నల్గొండ టౌన్: రాష్ట్రంలో జరగబోయే సర్పంచి ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు పరిమితి 50 శాతం మించకూడదనీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో ప్రతులని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిసి యూత్, విద్యార్థి జేఏసీ చైర్మన్లు కట్టెకోలు దీపెందర్, అయితగోని జనార్దన్ గౌడ్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపిల మోసం ఫలితమే జీవో నెంబర్ 46 విడుదల అయిందని రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్న,బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసిందనీ, ఇప్పుడు 9 జీవోను రద్దు చేసి 46 జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అణిచవేతకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రెడ్ల ప్రయోజనాల కోసమే జీవో నెంబర్ 46 ఉపయోగపడుతుందని ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు  పార్లమెంటులో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప చేయడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు పెద్దవద్దమైన రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం ఉండేదని,   రెండు పార్టీలు కలిసి బీసీలను బలి పశువు చేశాయని ఆయన ఆరోపించారు.

జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని, జీవో నెంబర్ 9 మాత్రమే అమలు చేయాలి ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పట్టణ చైర్మన్, పుట్ట వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్,  కన్వీనర్ కర్నాటి యాదగిరి, వైస్ ఛైర్మన్లు మార్గం సతీష్, వడ్డేబోయిన రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్,చెన్నోజు రాజు, ప్రధాన కార్యదర్శి అంబటి శివ, చిరబోయిన వెంకటేశ్వర్లు రామస్వామి, గడ్డం మారయ్య, పగిళ్ళ సైదులు, కొత్తకొండ రమేష్, ఏల్లుట్ల సైదులు, పులిపాటి జీవన్, మెడిగ నాగరాజు, చిలువేరు యోగానందం, మాంద్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.