11-07-2025 12:33:37 AM
- డీఎంహెచ్ వో పాపారావు, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
- హయత్ నగర్ ప్రభుత్వ దవాఖానలో ప్రధాన మంత్రి టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం
ఎల్బీనగర్, జులై 10 : భారతదేశంలో క్షయ వ్యాధి(టీబీ)ని తరిమికొట్టాలని, ప్రజలందరూ త ప్పనిసరిగా ప్రతి ఏడాది వైద్యపరీక్షలు చేయించుకుని, ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్ వో పా పారావు, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి సూచించారు. ప్రధాన మంత్రి టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం హయత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో(పీహెచ్ సీ) హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా టీబీగ్రస్తులకు నిత్యావసర వస్తువు లు, మందులు అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో 2025 నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా నేరుగా రూ, 500 పింఛన్ తోపాటు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని ఇస్తున్నారని తెలిపారు.
హెల్త్ క్యాంపులో 200 మందికి పైగా ప్రజలు వైద్యపరీక్షలు చేయిం చుకున్నారని, టీబీ, డయాబెటిక్స్, బీపీ, బీ, సీ వ్యాధులకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి (ౄMHO) పా పారావు, వైద్యులు మిసభ షహీన్, హరీష్, సోహెల్, ల్యాబ్ టెక్నీషియన్స్ సాగర్, వంశీ , ఏఎన్‌ఎంలు వినోద, మంజుల, పార్వతి, బీజేపీ నాయకులు ఉగాది ఎల్లప్ప, పారంద మహేశ్, ఎర్రవెల్లి సత్యనారాయణ తదితరులుపాల్గొన్నారు.