15-12-2024 01:24:31 AM
15-.12.-2024 నుంచి 21.-12.-2024 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి :
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మంచిగా ఉంది. ధనాదా యం పెరుగుతుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పా ల్గొంటారు. సంతోషంగా గడుస్తుంది. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. అనుకూల సంబం ధాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ముం దుంటారు. రైతులు ఆనందంగా ఉంటా రు. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలం ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అ నుకూలంగా ఉంది. సంతృప్తిగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశీ యానం ఫలిస్తుంది. రైతులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మి శ్రమంగా ఉంది. ఆలోచిం చి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో బం ధువులతో సందడిగా ఉంటుంది. యువ తీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువు లలో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ధనలాభం పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. చేసే పనులు పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలు చేస్తారు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. కొందరితో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోష వార్తలు విం టారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. అశాంతిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అ వసరం. ధన వ్యయమవుతుంది. చేసే పనులలో సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ యత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపార స్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగు తుంది. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనులు పూర్తవుతాయి.- కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలా భం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శుభం జరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. వేగిర పడరాదు. శుభవార్తలు వింటారు. పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం ఉన్నా ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. -విద్యార్థులు చదువులను పట్టుదలతో సాగించాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనసు అశాంతిగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువులను పట్టుదలతో కొనసాగించాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యమంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.