11-05-2024 12:05:00 AM
మాట మార్చిన మహిళ
తనను బెదిరించి ఫిర్యాదు చేయించారని వెల్లడి
బెంగళూరు, మే 10: కర్ణాటకలోని హసన్ ఎంపీ, జేడీఎస్ బహిష్కృత నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసులమంటూ కొందరు వ్యక్తులు తనను వేధించి తప్పుగా ఫిర్యాదు చేయాలని బలవంతం చేశారని ఆమె పేర్కొన్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. కాగా, జాతీయ మహిళా కమిషన్ ప్రకటనపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కేసు లో జేడీఎస్‌కు మరక అంటించాలనేదే ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే వ్యభిచా రం కేసు పెడతామని కొంతమందిని బెదిరించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల కేసుకు సంబంధించి ఇప్ప టి వరకు సిట్ దర్యాప్తు ఎందుకు ముం దుకు సాగడం లేదని ప్రశ్నించారు. బాధితురాలిని సిట్ అధికారులు ఇప్పటివరకు ఎందుకు న్యాయమూర్తి ఎదుట హాజ రుపరచలేదని అన్నారు. అయితే, ప్రజ్వల్ రేవణ్ణను సమర్థించే ప్రశ్నే లేదని కుమారస్వామి పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని.. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నా రు. కాగా, సిట్‌పై కుమారస్వామి చేసిన ఆరోపణలను కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తోసిపుచ్చారు. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సీరియస్‌గానే సాగుతోందని తెలిపారు. జేడీఎస్ చేస్తున్న ఆరోపణలన్నింటికీ ప్రభుత్వం బదులివ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించిన తర్వాత వివరాలు బయటపెడతామని చెప్పారు.