calender_icon.png 4 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.78 కోట్ల విలువైన మత్తు పదార్థాలు దహనం

29-10-2024 02:06:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28(విజయక్రాంతి): నగరం లోని అమీర్‌పేట, చార్మినార్, గో ల్కొండ పీఎస్‌ల పరిధిలో 79 కేసుల్లో పట్టుకున్న డ్రగ్స్‌ను హైదరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ కేఏబీ శాస్త్రీ ఆదే శాల మేరకు సికింద్రాబాద్ ఏఈఎస్ ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. దహనం చేసిన మత్తు పదార్థాల విలువ సుమారు రూ.2.78 కోట్లు ఉంటుందని, వాటిలో 135.8 కిలోల గంజాయి, 174.8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1939.5 కిలోల పాపిష్ట, 2.1 గ్రాముల హాష్ ఆయిల్, 25 ఎల్‌ఎస్‌డీ బాస్ట్‌లు, 9.8 కిలోల ఆల్ఫ్రాజోలం, 14 గ్రాముల ఎస్టోస్టిపీల్స్ ఉన్నట్లు వెల్లడించారు.