13 April, 2026 | 10:49 PM

అమెరికాలో ఇద్దరి మృతి

13-05-2024 12:24 AM

జలపాతంలో మునిగిన తెలంగాణ విద్యార్థులు

ఖమ్మం, మే 12 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరి కా వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు జలపాతంలో పడి మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం కు చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దంపతుల కుమారుడు రాకేశ్ రెడ్డి(౨౩), అదే జిల్లాకు చెందిన రోహి త్ మణికంఠ రేపాల (౨౫) అరిజోనా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పట్టా పొందిన సందర్భంగా ఈ నెల ౮న మిత్రులతో కలిసి అరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌క్రీక్ జలపాతం సందర్శనకు వెళ్లారు. ఆ క్రమంలో రాకేశ్, రోహిత్ జలపాతంలో గల్లంతయ్యా రు. తోటి స్నేహితులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు గజ ఈతగాళ్ల సాయంతో వెతకగా జలపాతంలో ౨౫ అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలు లభించాయి. రాకేశ్‌రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఖమ్మం కు చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ స్కూళ్ల అధిపతుల్లో ఒకరు. కొడుకు పట్టా స్వీకరణ కార్యక్రమానికి వెళ్లిన తల్లిదండ్రులు.. కొడుకు మృతదేహాన్ని తీసుకురావాల్సిన హృదయ విదారకర పరిస్థితి ఏర్పడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ వివరాలు తెలియాల్సి ఉంది.